హైదరాబాద్‌లో ఏటీఎం సెంటర్‌లో వ్యక్తి మృతదేహం

  • విజయ్ నగర్ కాలనీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో వ్యక్తి మృతదేహం
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
  • ప్రమాదవశాత్తు మృతి చెందాడా, హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు
హైదరాబాద్‌లోని ఓ ఏటీఎం సెంటర్‌లో ఒక వ్యక్తి మృతదేహం ఉండటం స్థానికంగా కలకలం సృష్టించింది. నగరంలోని మాసాబ్‌ట్యాంక్ పరిధిలోని విజయ్ నగర్ కాలనీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో స్థానికులు వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. వారు వెంటనే మెహదీపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేక ఎవరైనా హత్య చేసి పడవేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad ATM death
Hyderabad
ATM center
Vijay Nagar Colony
HDFC bank
Mehdipatnam police

More Telugu News